China: కరోనా భయంతో పెంపుడు జంతువులను భవనం పై నుంచి పడేస్తోన్న చైనా ప్రజలు

  • జంతువుల కారణంగానే కరోనా వ్యాపిస్తుందని అభిప్రాయాలు 
  • పెంపుడు జంతువులకు భయపడుతోన్న చైనా ప్రజలు 
  • కుక్కలు, పిల్లులతో కరోనా వ్యాపిస్తుందనడానికి ఆధారాలు లేవంటోన్న ప్రభుత్వం
చైనా ప్రజలను కరోనా వైరస్‌ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్‌ జంతువుల కారణంగానే వ్యాపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను కూడా రోడ్లపై పడేస్తున్నారు.

వ్యాధి సోకిన వ్యక్తులతో గడిపిన జంతువులను క్యారంటైన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు. అయితే, పెంపుడు జంతువుల వల్ల ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని బాగా నమ్మేస్తోన్న చైనా ప్రజలు కుక్కలను, పిల్లులను తాముంటున్న అపార్ట్‌మెంట్ల మీద నుంచి కిందకు పడేస్తున్నారు.

దీంతో అవి చనిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వస్తున్నాయి. జంతువును చంపకూడదని అక్కడడి ప్రభుత్వం సూచనలు చేస్తోంది. కుక్కలు, పిల్లులతో కరోనా వ్యాపిస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది.
China
karona virus

More Telugu News