Prakasam District: ఒంగోలులో ప్రార్థనా మందిరం కోసం ఇరువర్గాల మధ్య వివాదం

  • ఓ వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళన
  • భారీగా మోహరించిన పోలీసులు
  • ఆ దారిలో వెళ్తున్నమంత్రులను అడ్డుకున్న ఆందోళనకారులు

ఓ ప్రార్థనా మందిరం వద్ద ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఈ ఉదయం టెన్షన్ నెలకొంది. నగరంలోని జేయంబి చర్చిలో ప్రార్థనల సందర్భంగా ఈ వివాదం మొదలయ్యింది. నగరంలోని ఓ వర్గం తొలుత చర్చిలో ప్రార్థనల కోసం వచ్చింది. వీరు ప్రార్థనలు చేయడానికి వీలులేదంటూ మరో వర్గం చర్చికి తాళాలు వేసింది. దీంతో ఎదుటి వర్గం చర్చి ఎదుట రోడ్డు పైనే బైఠాయించి ఆందోళన చేసింది. అక్కడే ప్రార్థనలు కూడా చేశారు.

ఈ విషయం పోలీసులకు చేరడంతో భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో జిల్లా అవతరణ దినోత్సవాలకు హాజరయ్యేందుకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ లు ఇదే దారిలో వెళ్లడంతో వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు.

Prakasam District
ongole
churchi
two groups

More Telugu News