Uttar Pradesh: ఆందోళనకారులకు కేజ్రీవాల్ బిర్యానీలు పంచిపెడుతున్నారు: కేజ్రీవాల్‌పై యోగి తీవ్ర ఆరోపణలు

  • కశ్మీర్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారే వీరు
  • వారి పూర్వీకులు దేశాన్ని విభజించారు
  • శ్రేష్ఠ్ భారత్‌గా దేశం అవతరిస్తుండడాన్ని సహించలేకే ఇదంతా..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. షాహిన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం బిర్యానీలు పంచిపెడుతోందని ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారే షాహిన్‌బాగ్‌లో ఆందోళనలు చేస్తున్నారని  ఆరోపించారు.

వారి పూర్వీకులు దేశాన్ని విభజించారని షాహిన్‌బాగ్ ఆందోళనకారులను ఉద్దేశించి యోగి అన్నారు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’గా దేశం అవతరిస్తుండడాన్ని చూసి సహించలేకే వారు ఆందోళనలు చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.
Uttar Pradesh
Yogi Adityanath
Arvind Kejriwal

More Telugu News