Nagarjuna university: జై అమరావతి అన్నారని.. నలుగురు విద్యార్థులపై వేటేసిన నాగార్జున యూనివర్సిటీ

  • అమరావతి అనుకూల నినాదాలు
  • సస్పెండ్ చేసిన వర్సిటీ యాజమాన్యం
  • హాస్టల్ విడిచి వెళ్లాలని ఆదేశాలు
‘జై అమరావతి’ అని నినదించిన నలుగురు విద్యార్థులపై గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేటేసింది. ఆశీర్వాదం, ఏడుకొండలు, నవీన్, రాజు అనే విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. ‘జై అమరావతి’ అని నినదించినందుకే వారిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. సస్పెండ్ అయిన విద్యార్థులు నలుగురూ హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు, క్రమశిక్షణ కమిటీ ఎదుట రేపు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
Nagarjuna university
Andhra Pradesh
students

More Telugu News