Telugudesam: అందుకే, ఏపీకి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు: వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు లేకపోవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. చేతకాని ప్రభుత్వానికి నిధులిచ్చినా ఏం ప్రయోజనమని కేంద్ర ప్రభుత్వం అనుకుందేమోనని, అందుకే, మన రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు ఇవ్వలేదని సెటైర్లు విసిరారు. వైసీపీ ఎనిమిది నెలల పాలనలో రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రాన్ని ఒక్కసారైనా అడిగారా? అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవడం కాదు, గెలిచి ఏం సాధించారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Go Back to Shorts
Telugudesam
Nara Lokesh
YSRCP
Jagan
cm

More Telugu News