కేంద్ర బడ్జెట్ మొత్తం అంచనా రూ.30,42,230 కోట్లు!
- రూ.30.42 లక్షల కోట్ల ఆదాయ, వ్యయాలతో అంచనాలు
- మూలధన వసూళ్లు రూ.10.21 లక్షల కోట్లు
- రెవెన్యూ లోటు రూ.6 లక్షల కోట్లు
- ద్రవ్యలోటు అంచనా రూ.7.96 లక్షల కోట్లు
ఇక, తాజా బడ్జెట్ విషయానికొస్తే, పన్నుల ద్వారా రూ.16.35 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3.85 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. మూలధన వసూళ్లు రూ.10.21 లక్షల కోట్లు కాగా, అందులో రుణాల వసూళ్ల ద్వారా రూ.14.96 వేల కోట్లు, ఇతర మార్గాల్లో రూ.10 లక్షల కోట్లకు అంచనాలు రూపొందించారు. ఈసారి రెవెన్యూ లోటు రూ.6 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటును రూ.7.96 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.