కేంద్రం మాట నమ్మితే.. శంకరగిరి మాన్యాలే దిక్కు!: సీఎం కేసీఆర్
- 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల రాష్ట్రానికి నిధుల కోత
- గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.3,731కోట్లు తగ్గాయి
- నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపింది
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిందంటూ.. దీనివల్ల రాష్ట్రానికి రూ.2,381 కోట్ల నిధులు తగ్గుతాయని తెలిపారు. కేంద్రం చెప్పే మాటకు, ఇచ్చే నిధులకు పొంతన లేకుండా పోతోందంటూ.. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందని సీఎం వ్యాఖ్యానించారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.3,731 కోట్లు తగ్గాయని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా తగ్గించటం కేంద్రం అసమర్థతని చెప్పుకొచ్చారు. ‘2020-21 బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ రాష్ట్రానికి రెండు రకాల నష్టం వాటిల్లింది. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే పన్నుల వాటాను 42 శాతం నుంచి 41శాతానికి తగ్గిస్తున్నారు’ అని కేసీఆర్ అన్నారు.