Rajamouli: ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురువారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాజమౌళి

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ జాయింట్ రీప్లేస్ మెంట్ వైద్య నిపుణుడు డాక్టర్ గురవారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మోకాళ్లకు వైద్యం చేయడంలో ఎంత నిష్ణాతుడో, సాహిత్యం, వక్తృత్వం, వంటలు చేయడం, యాంకరింగ్, యూట్యూబ్ చానల్ నిర్వహణలో ఆరితేరిన వ్యక్తి. తన సన్ షైన్ హాస్పిటల్ లో ఆయన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే, రోబో సాయంతో జాయింట్ రీప్లేస్ మెంట్ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు డాక్టర్ గురవారెడ్డి సరికొత్త ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురవారెడ్డికి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాదులో డాక్టర్ గురవారెడ్డి సన్ షైన్ రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్ మెంట్ సెంటర్ స్థాపించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని రాజమౌళి పేర్కొన్నారు. డాక్టర్ గురవారెడ్డికి, ఆయన బృందానికి భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. కాగా, రాజమౌళి, డాక్టర్ గురవారెడ్డి మధ్య బంధుత్వం ఉంది. డాక్టర్ గురవారెడ్డి వరుసకు రాజమౌళికి బావ అవుతారు.
Go Back to Shorts
Rajamouli
Dr.Guravareddy
Sunshine
Hospital
Robotic Assisted

More Telugu News