బడ్జెట్ లో కొత్త పథకం ‘కృషి ఉడాన్’.. ప్రత్యేక విమానాల్లో కూరగాయలు, పండ్లు, పూల రవాణా!
- వ్యవసాయ ఉత్పత్తులకు విలువ కల్పించేందుకే ఈ పథకం
- జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో అమలు
- పాలు, మాంసం, చేపల రవాణాకోసం ‘కిసాన్ రైల్’ పథకం
ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన జిల్లాల్లోని వ్యవసాయ ఉత్పత్తులకు విలువ కల్పించే దిశగా ప్రభుత్వం ఈ పథకం తీసుకొస్తుందని మంత్రి తెలిపారు. పౌర విమానయాన శాఖ ఈ పథకాన్ని ప్రారంభించనుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కాగా, పాలు, మాంసం, చేపల వంటి ఆహార ఉత్పత్తుల రవాణాకోసం ‘కిసాన్ రైల్’ పథకాన్ని తెస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆహార పదార్థాల రవాణాకోసం ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైళ్లలో ప్రత్యేకంగా రిఫ్రిజిరేటెడ్ బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ పథకాలతో పాటు గ్రామాల్లో ఆహార ధాన్యాల నిల్వకోసం విలేజ్ స్టోరేజ్ పథకం, చిన్నతరహా ఎగుమతి దారులకోసం ‘నిర్విక్’ అనే పేరుతో బీమా పథకాన్ని ప్రకటించారు.