అన్నింటికీ అవకాశాలు కల్పించే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
- వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ
- అన్ని రంగాలకు ప్రోత్సాహమిస్తున్నామని వ్యాఖ్యలు
భారత్ లో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలున్నాయని, వాటి వినియోగానికి తోడ్పడే బడ్జెట్టును రూపొందించామని చెప్పారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్ భారత్ కొత్త దశను నిర్దేశిస్తుందని అన్నారు. ఆక్వా విప్లవంతో మత్స్యపరిశ్రమలో విస్తృత అవకాశాలకు వీలవుతుందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని ప్రధాని వెల్లడించారు. దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు బడ్జెట్ లో తగిన ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు.