President Of India: హైదరాబాద్ లో రాష్ట్రపతి ఒకరోజు పర్యటన.. ఘనస్వాగతం

  • అతి పెద్ద ధ్యానమందిరం సందర్శనకు వచ్చిన కోవింద్
  • ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు
  • కోవింద్ కు స్వాగతం పలికిన గవర్నర్, సీఎం తదితరులు
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరాన్ని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలో ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించే నిమిత్తం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఒకరోజు పర్యటన నిమిత్తం ఇవాళ హైదరాబాద్ విచ్చేశారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రామ్ నాథ్ కోవింద్ దంపతులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. కాగా, రెండేళ్ల క్రితం రామ్ నాథ్ కోవింద్ ఈ ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేశారు.
President Of India
Ramnath kovind
Tamili sai
Kcr

More Telugu News