central Budget: ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచింది.. ఏపీకి మొండిచేయి చూపించింది: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి
  • ఈ విషయమై పార్లమెంట్ లో పోరాడతాం
  • ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని విజయసాయి డిమాండ్
కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచిందని, నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. ఏపీకి ఒక్కకొత్త రైల్వే ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదని, రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల అభివృద్ధికి నిదులు ఇవ్వలేదని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించలేదని, పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీల ఊసే లేదని మండిపడ్డారు.

ఏపీ విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటు కింద నిధులు రావాలని, ప్రాజెక్టుల కేటాయింపులో పోలవరం ప్రాజెక్టు కూడా చేర్చాలని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తారనే విషయమై స్పష్టత లేదని, పోలవరం ప్రాజెక్టు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి పక్షపాత ధోరణి మంచిది కాదని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో పోరాడతామని అన్నారు.
central Budget
YSRCP
Vijayasai Reddy
mp

More Telugu News