Harish Sankar: మరోసారి మ్యాజిక్ చేస్తాం: పవన్ తో మళ్లీ చిత్రం చేయడంపై హరీశ్ సంబరం

  • 2012లో గబ్బర్ సింగ్ ప్రభంజనం
  • పవన్, హరీశ్ శంకర్ కాంబోలో బ్లాక్ బస్టర్
  • ఇప్పుడు అదే కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్
పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఎనిమిదేళ్ల కిందట వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పుడదే కాంబినేషన్ మళ్లీ రిపీటవుతోంది. పవన్, హరీశ్ ల కలయికలో ఓ సినిమా తీస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందిస్తూ, మరోసారి పవన్ తో సినిమా చేస్తున్నానని తెలిపాడు. గబ్బర్ సింగ్ ను మించేలా చిత్రం చేస్తామని, ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు మీ అందరి ఆశీస్సులు కావాలని ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ 28వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Harish Sankar
Pawan Kalyan
Gabbar Singh
Mytri Movie Makers

More Telugu News