ఆదాయ పన్ను మినహాయింపులు... కొత్త శ్లాబులు.. కేంద్ర బడ్జెట్ లో వెల్లడి
- ఆదాయ పన్ను శ్లాబులో భారీ మార్పులు
- 4 శ్లాబుల స్థానంలో 7 శ్లాబులు
- మధ్య, ఎగువతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని పన్ను విధానం
రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను విధించారు. రూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్ను లేదు.