Parakala Vangmayi: లోక్ సభ గ్యాలరీలో సందడి చేసిన పరకాల వాంగ్మయి!

  • కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
  • గ్యాలరీ నుంచి తిలకించనున్న వాంగ్మయి
  • ప్రజలకు నచ్చేలా ఉంటుందని అభిప్రాయం
లోక్ సభలో తన రెండో బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాగా, ఆమె ప్రతిపాదనలను ప్రత్యేక్షంగా తిలకించేందుకు కుమార్తె పరకాల వాంగ్మయి ప్రత్యేకంగా వచ్చారు. లోక్ సభ అధికారులు కొందరు వాంగ్మయిని రిసీవ్ చేసుకుని లోనికి తీసుకెళ్లారు. లోక్ సభ గ్యాలరీల్లో నుంచి ఆమె, తన తల్లి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ను తిలకించనున్నారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ, ఈ బడ్జెట్ ప్రజలకు నచ్చుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలో ప్రభుత్వానికి తెలుసునని, అందుకు తగ్గట్టుగానే ప్రతిపాదనలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Parakala Vangmayi
Nirmala Sitharaman
Budget
Lok Sabha

More Telugu News