Chandrababu: చైనా నుంచి తెలుగు ఇంజినీర్లను తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు: విజయసాయిరెడ్డి

  • చైనా నుంచి 58 మంది తెలుగు ఇంజినీర్లు ఢిల్లీకి చేరుకున్నారు
  • వైద్య పరీక్షల అనంతరం వారిని ఇంటికి పంపిస్తారు
  • వారి యోగ క్షేమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది
చైనాలోని వూహాన్‌ నగరంలో శిక్షణ పొందుతున్న 58 మంది తెలుగు ఇంజనీర్లు ఢిల్లీకి చేరుకున్నారని... వైద్య పరీక్షల అనంతరం వారిని ఇంటికి పంపిస్తారని విజయసాయి అన్నారు. మొన్న అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తిన వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. చైనా నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్ధులు, ఇంజనీర్లను వైద్య పరీక్షలు, పర్యవేక్షణ అనంతరం వారి స్వస్థలాలకు చేరుస్తారని వెల్లడించారు. వారి యోగక్షేమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సహాయక చర్యలను తీసుకుంటోందని తెలిపారు.
Chandrababu
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News