Tihar: తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న ఖైదీ!

  • బాలికపై అత్యాచారం చేసి జైలుకొచ్చిన రాజేశ్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఇదే జైల్లో నిర్భయ దోషులు
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తీహార్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాజేశ్ అనే ఖైదీ, తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గమనించిన జైలు వార్డర్లు, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అతను మరణించాడు. రాజేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తామని జైలు అధికారులు తెలిపారు. కాగా, ఇదే జైల్లో నిర్భయ దోషులు కూడా వుంటున్న సంగతి తెలిసిందే.
Tihar
Jail
Sucide
Accused

More Telugu News