shabana azmi: కోలుకున్న బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

  • గత నెల 18న రోడ్డు ప్రమాదంలో గాయపడిన షబానా 
  • 13 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స
  • మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యులు
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ కోలుకున్నారు. తీవ్రగాయాలతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన షబానా 13 రోజులపాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే, కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

జనవరి 18న ఆమె ప్రయాణిస్తున్న కారు ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఖాలాపూర్ టోల్‌ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.  తొలుత ఆమెను నవీ ముంబైలోని  మహాత్మాగాంధీ మిషన్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అయితే, మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అంధేరీలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు.
shabana azmi
Bollywood
Actress
Road Accident

More Telugu News