Kurnool District: అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కార్యాలయాలు కర్నూలుకు తరలింపు!

  • విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ కార్యాలయాల తరలింపు
  • అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • భవనాలు చూడాలంటూ కర్నూలు కలెక్టర్‌కు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేసింది. కర్నూలుకు తరలిస్తున్న కార్యాలయాల్లో విజిలెన్స్ కమిషన్,  కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. వాటికి అవసరమైన భవనాలను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ ఇన్‌ చీఫ్‌, కర్నూలు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Kurnool District
Andhra Pradesh
YS Jagan

More Telugu News