Telugudesam: రాక్షసానందం పొందుతున్నారంటూ జగన్ పై లోకేశ్ విమర్శలు!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని అమరావతిని తరలించాలన్న ఆలోచనలో ఉన్న సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శల పరంపర కొనసాగుతోంది. ‘ఉత్తరాంధ్ర ద్రోహి వైఎస్ జగన్, కాదు కాదు, ఆంధ్రప్రదేశ్ ద్రోహి వైఎస్ జగన్’ క్యాప్షన్స్ తో ట్విట్టర్ వేదరికగా ఆయనపై విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాక్షసానందం పొందుతున్నారంటూ ‘జగన్ ఫెయిల్డ్ సీఎం’ అనే హ్యాష్ ట్యాగ్ తో విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు రుణాలు రాకుండా చేశారని, పెట్టుబడులు రాకుండా చేశారని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
Go Back to Shorts
Telugudesam
Nara Lokesh
YSRCP
Jagan
cn

More Telugu News