India: ఇలాంటి మ్యాచ్ లు ఇక చాలు: వెల్లింగ్టన్ లో కోహ్లీ వ్యాఖ్యలు

  • కివీస్ తో మరో మ్యాచ్ లో సూపర్ ఓవర్
  • విజయం సాధించిన టీమిండియా
  • జట్టు సత్తాకు ఇది నిదర్శనమని వ్యాఖ్యలు
కివీస్ తో వరుసగా మరో మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ కు దారితీయడం, టీమిండియా వీరోచిత పోరాటంతో నెగ్గడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ప్రతి మ్యాచ్ ఇలా జరగాలని కోరుకోలేమని, ఇక చాలని చెప్పాడు. ప్రత్యర్థి బాగా ఆడుతున్నప్పుడు చివరి వరకు నిబ్బరంగా ఉంటూ పుంజుకునేందుకు ప్రయత్నించాలని, ఈ రెండు మ్యాచ్ ల ద్వారా తాను నేర్చుకున్న కొత్త విషయం ఏదైనా ఉందంటే ఇదేనని వివరించాడు. గతంలో సూపర్ ఓవర్లలో తమకు పెద్దగా అనుభవం లేదని, కానీ ఇప్పుడు రెండింటికి రెండు సూపర్ ఓవర్లలో నెగ్గామని అన్నాడు. ఓ జట్టుగా టీమిండియా సత్తా ఏంటో ఈ రెండు విజయాలు చాటిచెబుతాయని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఎంతో ఒత్తిడిలో రాణించడం పట్ల గర్విస్తున్నామని తెలిపాడు.
India
Team New Zealand
Wellington
Super Over
Tie
Virat Kohli

More Telugu News