Telugudesam: జగన్ ఊహించుకుంటున్నట్టు అమరావతి ఎడారిలో లేదు: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి

  • విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందిన నగరాలు 
  • ఆ నగరాల మధ్య అమరావతి ఉంది
  • సృష్టించిన సంపదను ప్రభుత్వం ఉపయోగించుకోలేక పోతోంది
సీఎం జగన్ ఊహించుకుంటున్నట్టు అమరావతి అనేది ఎడారిలోనో, శ్మశానంలోనో లేదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు అభివృద్ధి చెందిన నగరాలు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అమరావతి నిర్మాణానికి తమ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ చేశామని, అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే ఆరోజున ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందని అన్నారు.

ఈ వాస్తవాన్ని సీఎం జగన్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. బీసీజీ నివేదికపై ఆయన విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఉన్న ‘ల్యాండ్ బ్యాంకు’ ద్వారా వచ్చిన ఆదాయంతోనే రాజధాని నిర్మాణానికి నిధులు సమకూరుతాయని తాము చెబుతుంటే, కాదని సీఎం జగన్, మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. సృష్టించిన సంపదను ఉపయోగించుకుని రాజధాని నిర్మాణం చేయడం చేతగాక, ఇలాంటి తప్పుడు నివేదికల ద్వారా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
Telugudesam
Pattabhi
YSRCP
Jagan
cm

More Telugu News