Manish Pandey: మనీష్ పాండే ఫిఫ్టీ... గౌరవప్రదమైన స్కోరు సాధించిన టీమిండియా

  • వెల్లింగ్టన్ లో టీమిండియా, కివీస్ మధ్య 4వ టి20
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు
  • భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు
వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో టి20 మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆతిథ్య కివీస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.

88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ ను మిడిలార్డర్ బ్యాట్స్ మన్ మనీష్ పాండే ఫైటింగ్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. పాండే 36 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లోయరార్డర్ లో శార్దూల్ ఠాకూర్ 15 బంతుల్లో 20 పరుగులు చేయడంతో భారత్ 150 మార్కు దాటింది. చివర్లో నవదీప్ సైనీ సైతం బ్యాట్ ఝళిపించి 2 ఫోర్లు బాదాడు.

టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులు సాధించాడు. శాంసన్ (8), కోహ్లీ (11), అయ్యర్ (1), శివమ్ దూబే (12), వాషింగ్టన్ సుందర్ (0) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ 3, పేసర్ హామిష్ బెన్నెట్ 2 వికెట్లు తీశారు.
Manish Pandey
Team India
Team New Zealand
Wellington
T20

More Telugu News