Jagan: తల్లిని ఓడించారన్న ద్వేషంతో విశాఖపై విషం కక్కారు: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్

  • ఉత్తరాంధ్రను, విశాఖను దెబ్బతీసింది జగనేనని వ్యాఖ్యలు
  • కుట్రపూరితంగా రిపోర్ట్ రాయించారని ఆరోపణలు
  • పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాకుండా చేశారని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగనేనని, గతంలో తన తల్లిని ఎన్నికల్లో ఓడించారన్న ద్వేషంతో ఉత్తరాంధ్ర నడ్డివిరిచేలా జీఎన్ రావు కమిటీతో విషం కక్కారని మండిపడ్డారు. తుపానులు వస్తాయని, ఉప్పునీరు చొచ్చుకుని వస్తుందని, భద్రత ఉండదని కుట్రపూరితంగా రిపోర్ట్ రాయించారని ఆరోపించారు. ఇప్పుడీ చెత్త రిపోర్ట్ తో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాకుండా చేశారని లోకేశ్ ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రకు కంపెనీలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు రాకుండా చేసి జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ తో దారుణంగా దెబ్బతీశారని జగన్ పై విరుచుకుపడ్డారు.
Jagan
Nara Lokesh
Visakhapatnam
GN Rao Committee
AP Capital
Andhra Pradesh

More Telugu News