హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ ఉమన్' గా శ్రీముఖి
- బుల్లితెర రంగంలో నెంబర్ వన్ గా శ్రీముఖి
- హైదరాబాద్ టైమ్స్ ఆన్ లైన్ పోల్
- గతేడాది 11వ స్థానంలో నిలిచిన శ్రీముఖి
దీనిపై శ్రీముఖి స్పందిస్తూ, తాను టెలివిజన్ రంగానికి సంబంధించి 'మోస్ట్ డిజైరబుల్ ఉమన్' గా ఎంపికవుతానని అస్సలు ఊహించలేదని తెలిపింది. ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ నిర్వహించే ఈ ఆన్ లైన్ పోల్ ను బాగా ఫాలో అయ్యేదాన్నని, ఎప్పటికైనా గెలవాలని అనుకునేదాన్నని చెప్పింది. ఇప్పుడది నిజం కావడం అద్భుతంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. కాగా గతేడాది నిర్వహించిన పోల్ లో శ్రీముఖికి 11వ స్థానం దక్కింది.