Ramachiluka: రామచిలుకను బంధించారో జాగ్రత్త!: ఉపాసన

  • రామచిలుక ఏపీ రాష్ట్రపక్షి అని వెల్లడి
  • బంధిస్తే ఆరేళ్ల వరకు జైలుశిక్ష తప్పదు  
  • ఇలాంటి విషయాలపై అవగాహన కలిగివుండాలంటూ సూచన
మెగాకోడలు ఉపాసన కొణిదెలకు సామాజిక స్పృహ మెండుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అపోలో ఫౌండేషన్ పేరిట అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆమె పక్షుల గురించి చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. రామచిలుక ఏపీ రాష్ట్ర పక్షి అని మీకు తెలుసా? రామచిలుకనే కాదు ఏ పక్షినైనా పంజరంలో బంధించడం అక్రమం. ఆరేళ్ల వరకు జైలుశిక్ష కూడా విధిస్తారు.

ఇలాంటి విషయాలపై అవగాహన కలిగివుండడం వన్యప్రాణి సంరక్షణలో తొలి అడుగుగా భావిస్తున్నా అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. అంతేకాదు, రామచిలుక శాస్త్రీయనామం 'సిట్టాక్యులా క్రామెరి' అని కూడా తన ట్వీట్ లో తెలియజేశారు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన 'వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్' కోసం ఓ కార్యక్రమానికి తెరదీశారు. అందులో భాగంగానే ఉపాసన ప్రచారం షురూ చేసినట్టు తెలుస్తోంది.
Ramachiluka
Parrot
Upasana
Ramcharan
WWFIndia

More Telugu News