CoronaVirus: కరోనా దెబ్బ... చైనాతో సరిహద్దులను మూసివేయాలని రష్యా నిర్ణయం

  • చైనాలో కరోనా ఘంటికలు
  • నానాటికి విస్తరిస్తున్న ప్రాణాంతక వైరస్
  • కీలక నిర్ణయం తీసుకున్న రష్యా
చైనాలో ప్రబలిన కరోనా వైరస్ మహమ్మారి పొరుగుదేశాలను హడలెత్తిస్తోంది. తాజాగా, తమ దేశంలోకి ఈ ప్రమాదకర వైరస్ ను రానివ్వకుండా చేసేందుకు రష్యా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. చైనా సరిహద్దును మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉన్నతస్థాయిలో ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్తిన్ తెలిపారు.

ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు చైనాకు విమాన సర్వీసులు నిలిపివేశాయి. చైనాలో ఉన్న తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు అనేక దేశాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ ముప్పు క్రమంగా ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటివరకు చైనాలో కరోనా వైరస్ కారణంగా 170 మంది ప్రాణాలు కోల్పోయారు.
CoronaVirus
China
Russia
Border
Mikhail Mishustin

More Telugu News