Amaravati: అమరావతిలో విషాదం.... పురుగుల మందు కలిపిన మద్యం తాగి ఇద్దరి మృతి

  • తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఘటన
  • మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అలిగిన హరిబాబు అనే వ్యక్తి
  • మద్యంలో పురుగుల మందు కలిపి తాగిన వైనం
  • అదే మద్యం తాగిన వందనం అనే మరో వ్యక్తి
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో విషాదం నెలకొంది. పురుగుల మందు కలిపిన మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ ఘటన జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కుటుంబసభ్యులపై అలకబూనిన హరిబాబు అనే వ్యక్తి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు.

అయితే, అటుగా వెళుతూ హరిబాబు మద్యం తాగడాన్ని చూసిన వందనం అనే వ్యక్తి తనకు కూడా మద్యం కావాలని హరిబాబును అడిగాడు. అందులో పురుగుల మందు కలిపానని హరిబాబు ఎంత చెప్పినా వినని వందనం ఆ మద్యాన్ని తాను కూడా తాగాడు. ఈ ఘటనలో హరిబాబు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, వందనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Amaravati
Alcohol
Pesticides
Tulluru
Venkatapalem

More Telugu News