Nara Lokesh: టీడీపీ నేతలను అడ్డుకోవడం హీరోయిజం అనుకుంటున్నారు: లోకేశ్

  • దమ్ముంటే జగన్ ను అడ్డుకోవాలని సవాల్
  • రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి జగనేనని వ్యాఖ్యలు
  • జగన్ అభివృద్ధి చేస్తానంటే నమ్మే వాళ్లెవరూ లేరని ట్వీట్
అధికారంలో ఉన్నాం అనే స్పృహ లేకుండా టీడీపీ నాయకులను అడ్డుకోవడమే హీరోయిజం అనుకుంటున్నారని మాజీమంత్రి నారా లోకేశ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే వారి నాయకుడు జగన్ ను అడ్డుకోవాలని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ద్రోహం చేసింది జగనేనని, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వస్తామంటున్న పెద్ద కంపెనీలను తరిమికొట్టి అక్కడి యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కొత్త ఉద్యోగాలు సృష్టించకుండా ఉన్న కార్యాలయాలు అటూ ఇటూ మార్చి అభివృద్ధి చేస్తానంటే నమ్మేవాళ్లు ఇక్కడెవరూ లేరంటూ వ్యాఖ్యానించారు.

ఈ మూడు ముక్కలాటలో అభివృద్ధి ప్రణాళిక ఎక్కడుందని నిలదీయాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయబోతున్నారంటూ ప్రశ్నించాలని లోకేశ్ ఉద్బోధించారు. అంతేతప్ప, జగన్ తీసుకునే తుగ్లక్ నిర్ణయాలకు అందరూ జై కొట్టాలంటూ హడావుడి చేస్తే మిమ్మల్ని కూడా ప్రజలు జగ్లక్ లని ఫిక్స్ అవుతారని లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.
Nara Lokesh
Jagan
Tuglak
Jaglak
Telugudesam
YSRCP

More Telugu News