Tapsee: ఓ ఆకతాయి అసభ్యంగా తాకాడు.. రెండు వేళ్లు విరిచేశా: తాప్సీ

  • గురుద్వారాకు వెళ్లినప్పుడు ఓ ఆకతాయి నాపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు
  • ప్రవర్తన హద్దు మీరడంతో చేతి వేళ్లు విరిచేశా
  • కరీనా కపూర్ షోలో చేదు అనుభవాన్ని వెల్లడించిన తాప్పీ
ఓ ఆకతాయి తనను అసభ్యంగా తాకాడంటూ సినీ నటి తాప్పి సంచలన నిజాన్ని వెల్లడించింది. కరీనా కపూర్ షో 'వాట్ ఉమెన్ వాంట్-2' లో ఆమె మాట్లాడుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. గురుపూజ కోసం ఢిల్లీలోని గురుద్వారాకు కుటుంబ సమేతంగా వెళ్లానని, అప్పుడు అక్కడ విపరీతమైన రద్దీ ఉందని, అదే అదనుగా ఒక ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని వెల్లడించింది. తనపై చేతులు వేసి, ఇబ్బందికరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని, అతని ప్రవర్తన హద్దు మీరడంతో రెండు వేళ్లు పట్టుకుని విరిచేశానని చెప్పింది. ప్రస్తుతం తాప్సీ క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తోంది.
Tapsee
Bollywood
Sexual Abuse
Tollywood

More Telugu News