Nani: నాని కొత్త సినిమా 'టక్ జగదీష్' ప్రారంభం

  • హైదరాబాదులో పూజా కార్యక్రమాలు
  • నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్
  • ఫిబ్రవరి 11 నుంచి రెగ్యులర్ షూటింగ్
టాలీవుడ్ యువ హీరో నాని కొత్త చిత్రం 'టక్ జగదీష్' లాంఛనంగా ప్రారంభమైంది. 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇందులో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. 'టక్ జగదీష్' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 11 నుంచి జరగనుంది. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. గతంలో వచ్చిన 'నిన్ను కోరి' బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది.
Nani
Tuck Jagadish
Siva Nirvana
Ritu Varma
Aishwarya Rajesh
Tollywood

More Telugu News