Roja: అప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ను ఎందుకు ఇవ్వలేదు?: చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

  • రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు
  • మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటవుతాయి 
  • శాసన మండలి రద్దవుతుందన్న రోజా
రాష్ట్ర అభివృద్ధిని టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అమరావతి పేరుతో ఆటంకాలను సృష్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. అమరావతిపై అంత చిత్తశుద్ధి ఉంటే... సీఎంగా ఉన్నప్పుడు దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా మూడు రాజధానులు ఏర్పాటవుతాయని, శాసనమండలి రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Roja
Chandrababu
Amaravati
Telugudesam
YSRCP

More Telugu News