Jagan: మీ తీరు మార్చుకోండి మహాశయా: జగన్‌కు వర్ల రామయ్య సూచన

  • ముఖ్యమంత్రి గారు ఏటికి ఎదురీదుతున్నారు
  • అది ప్రమాదమని గ్రహించండి
  • ప్రజాభీష్టానికి ఎదురు నడుస్తున్నది మీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలే ఆయన పతనానికి దారి తీస్తాయంటూ టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ తన తీరును మార్చుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు.

'ముఖ్యమంత్రి గారు ఏటికి ఎదురీదుతున్నారు. అది ప్రమాదమని గ్రహించండి. ప్రజాభీష్టానికి ఎదురు నడుస్తున్నది మీ ప్రభుత్వం. పతనం తప్పదని గ్రహించండి. ఎందరో నియంతలు ప్రజాగ్రహజ్వాలల్లో మాడి మసైపోయిన విషయం గ్రహించండి. 'అహం బ్రహ్మాస్మి' ధోరణిలో ఉంది మీ ప్రభుత్వ నడక. మార్చుకోండి మహాశయా' అంటూ వర్ల రామయ్య సూచించారు.
Jagan
YSRCP
Telugudesam
varla ramaiah

More Telugu News