IYR Krishna Rao: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఈ అంశాలపై ఒత్తిడి పెంచాలి: ఐవైఆర్ కృష్ణారావు

  • ధార్మిక పరిషత్తును దేవాదాయ చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలి
  • హిందూ ధర్మ ప్రచార ట్రస్టుకు చట్టబద్ధతను కల్పించాలి
  • ఈ అంశాలను ఏపీ బీజేపీ డిమాండ్ చేయాలి
ఏపీ బీజేపీ నేతలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పలు సూచనలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై కొన్ని అంశాలపై ఒత్తిడి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. దేవాలయాల్లోని అర్చకులకు సామాజిక విస్తరణ ప్రధాన లక్ష్యంగా చేసి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పారు.

ఏపీ ప్రభుత్వం హిందూ ధర్మ పరిరక్షణపై నిజాయతీ నిరూపించుకోవడానికి ఈ అంశాలను చేపట్టాలని ఐవైఆర్ సూచించారు. ధార్మిక పరిషత్తును దేవాదాయ చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేసి, దాన్ని బలోపేతం చేయాలని అన్నారు. హిందూ ధర్మ ప్రచార ట్రస్టుకు చట్టబద్ధతను కల్పించాలని చెప్పారు. ఈ ట్రస్టును సమరసతా వేదికకు అనుసంధానం చేయాలని సూచించారు. ఇవే అంశాలను ఏపీ బీజేపీ డిమాండ్ చేయాలని, ఈ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పోరాటం చేయాలని చెప్పారు.
IYR Krishna Rao
BJP
YSRCP

More Telugu News