Karate Kalyani: సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ నటి కరాటే కల్యాణి ఫిర్యాదు!

  • అశ్లీల వీడియోలు పంపుతున్నారు
  • పొద్దున్నే ఫోన్ చూడాలంటే భయంగా ఉంది
  • పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కల్యాణి
తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అశ్లీల వీడియోలు పంపించి చిత్ర హింసలు పెడుతున్నారని ఆరోపిస్తూ, సినీ నటి కరాటే కల్యాణి, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పొద్దున్నే లేచి ఫోన్ చూడాలంటేనే భయపడుతున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు ఈ మెసేజ్ లు, వీడియోలు వస్తున్నాయని, నంబర్లను బ్లాక్ చేస్తే, వేరే ఫోన్ ల నుంచి పంపుతూ, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఆరోపించింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారని, వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. కల్యాణి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.
Karate Kalyani
Police
Cyber Crime
Complaint

More Telugu News