Telangana: తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి!

  • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు
  • నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల 
  • అధికారులతో సీఎం కేసీఆర్
తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయాలని, 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఎన్నికలు వెంటనే జరిపించాలని సూచించారు. ఇన్ చార్జ్ ల పదవీకాలం ముగిసేలోగానే షెడ్యూల్ ను ప్రకటించాలని అన్నారు. దీంతో అధికారులు సహకార సంఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభించారు.
Telangana
KCR
Elections

More Telugu News