Vidadala Rajini: ప్రొఫెషనల్ స్టయిల్లో వాలీబాల్ ఆడిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని

  • చిలకలూరిపేటలో ఓ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే రజని
  • విద్యార్థులతో వాలీబాల్ ఆడిన వైనం
  • మళ్లీ స్కూలు రోజుల్లోకి వెళ్లినట్టుందని ట్వీట్
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని క్రీడల్లో తన ప్రావీణ్యం ప్రదర్శించారు. చిలకలూరిపేటలోని ఓ ప్రభుత్వ పాఠశాల సందర్శనకు వెళ్లిన రజని అక్కడి విద్యార్థులతో వాలీబాల్ ఆడారు. ఎంతో ఉత్సాహంగా సర్వీస్ చేయడమే కాకుండా, స్ట్రయికింగ్ జోన్ లోనూ ఉత్సాహంగా కదులుతూ అందరినీ ఆకట్టుకున్నారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. 'పిల్లలతో వాలీబాల్ ఆడుతుంటే మళ్లీ నా స్కూల్ రోజుల్లోకి వెళ్లినట్టుగా ఉంది. నిజంగా చదువుకునే రోజులు ఎవరి జీవితంలోనైనా అత్యుత్తమ దినాలు' అంటూ రజని ట్వీట్ చేశారు.
Vidadala Rajini
Volleyball
Chilakaluripeta
Government School
YSRCP

More Telugu News