Police: కామారెడ్డి జిల్లాలో పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

  • మాచారెడ్డి పీఎస్ లో ఘటన
  • ఫ్యాన్ కు ఉరేసుకున్న కానిస్టేబుల్ లచ్చయ్య
  • దర్యాప్తుకు ఆదేశించిన ఎస్పీ శ్వేతారెడ్డి
కామారెడ్డి జిల్లా పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ లో ఎవరూ లేని సమయంలో ఆ కానిస్టేబుల్ ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ పేరు లచ్చయ్య. వయసు 52 సంవత్సరాలు.

లచ్చయ్య కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. లచ్చయ్య స్వస్థలం జనగామ. సహచరుడి ఆత్మహత్యతో ఇతర సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ఎస్పీ శ్వేతారెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు. లచ్చయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లచ్చయ్య సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
Police
Suicide
Kamareddy District
Machareddy PS
Telangana

More Telugu News