Hamilton: రసవత్తరంగా సాగుతున్న హామిల్టన్ టి20 పోరు

  • టీమిండియా స్కోరు 179/5
  • లక్ష్యఛేదనలో మెరుగైన స్థితిలో కివీస్
  • 15 ఓవర్లలో 3 వికెట్లకు 128 పరుగులు
  • అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కివీస్ సారథి
టీమిండియా విసిరిన 180 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో నిలిచింది. 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (63 బ్యాటింగ్), కొలిన్ డి గ్రాండ్ హోమ్ (4 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 31, కొలిన్ మున్రో 14 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో ఠాకూర్, చాహల్, జడేజా తలో వికెట్ తీశారు. విజయానికి కివీస్ కు కావాల్సింది 30 బంతుల్లో 52 పరుగులు కాగా, టీమిండియా బౌలర్లు వారిని ఎలా నిలువరిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.
Hamilton
T20
Team India
Team New Zealand

More Telugu News