Botsa Satyanarayana Satyanarayana: రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎలాగైనా మాట్లాడతారు: బొత్స

  • అన్ని కమిటీల నివేదికలు పరిశీలించాకే మూడు రాజధానుల నిర్ణయం
  • విశాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు 
  • శాసన మండలి రద్దుకు, రాజధానికి సంబంధం లేదు
రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎలాగైనా మాట్లాడుతారని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. ఈ రోజు తాడేపల్లిలో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అన్ని కమిటీల నివేదికలను చూసిన తర్వాతే.. మూడు రాజధానుల నిర్ణయం జరిగిందన్నారు. విశాఖపై చంద్రబాబుు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు విధానాల వల్లే ఏపీకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సలహాలు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. శాసన మండలి రద్దుకు, రాజధానికి సంబంధం లేదంటూ.. కొంచెం ఆలస్యం అవుతుందేమోకాని నిర్ణయం మారదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ జరుగుతోందన్నారు.
Botsa Satyanarayana Satyanarayana
YSRCP
Andhra Pradesh

More Telugu News