నిర్భయ దోషుల వరుస పిటిషన్లపై పూనమ్ కౌర్ ఆగ్రహం
- క్షమాభిక్ష కోరుతున్న దోషులు
- మృగాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారా అంటూ పూనమ్ ఆగ్రహం
- మానవ హక్కుల సంఘాల పేరుతో దందా జరుగుతోందని ఆరోపణ
నిర్భయ తల్లి ఆశా గారిని ఇదే ప్రశ్న అడిగితే, ఈ విషయంలో ఏదో కుట్ర జరుగుతోందమ్మా అంటూ ఆమె బదులిచ్చారని పూనమ్ కౌర్ వెల్లడించారు. "ఇవన్నీ చూసి మెదడు మొద్దుబారింది. ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి. ఇలాంటి రేపిస్టులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారు నాశనమైపోతారు. నిర్భయకు న్యాయం జరగాలని వాహే గురు, తిరుపతి బాలాజీని వేడుకుంటున్నాను" అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.