Jagan: వివేకా హత్య కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదు?: ఆలపాటి రాజా

  • జగన్ రాజద్రోహానికి పాల్పడ్డారు
  • రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు
  • విశాఖ భూలావాదేవీలపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత ఆలపాటి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై కమిటీలు ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేయకుండా అసెంబ్లీలో బిల్లులు పెట్టి రాజద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్ర నవనాడులను కుంగదీస్తున్నారని అన్నారు.

రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే పాలన ఇలాగే ఉంటుందని అన్నారు. వైయస్ వివేకా హత్య కేసులో సిట్ అధికారులను మారుస్తున్నారని చెప్పారు. ఈ కేసు విచారణను సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. విశాఖలో జరిగిన భూలావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Jagan
Alapati Raja
YS Viveka
Telugudesam
YSRCP

More Telugu News