Hyderabad: తన సోదరితో కలిసి ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

  • బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పెద్దలతో సమావేశం 
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీలోకి
  • ఆమెకు బీజేపీ సభ్యత్వాన్నిచ్చిన అరుణ్ సింగ్ 
భారత బ్యాడ్మింటన్ తార, హైదరాబాదీ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పెద్దలతో ఆమె ఈ రోజు ఉదయం సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె తమ పార్టీలోకి రావడం శుభసూచకమని అరుణ్ సింగ్ అన్నారు. ఆమెకు బీజేపీ సభ్యత్వాన్ని ఇచ్చారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్సూ నెహ్వాల్ కూడా బీజేపీలో చేరారు. అనంతరం తన సోదరితో కలిసి సైనా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాను కలిశారు.
Hyderabad
New Delhi
Saina Nehwal

More Telugu News