Tirupati: తిరుపతి హథీరాంజీ మఠం భూముల వ్యవహారంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం

  • మఠం భూములను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు
  • హథీరాంజీ మఠం మహంత్ అర్జున్‌దాస్‌పై సస్పెన్షన్ వేటు
  • శ్రీకాళహస్తి ఆలయ ఈవోకు అదనపు బాధ్యతలు  
తిరుపతిలోని హథీరాంజీ మఠం భూముల వ్యవహారంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మఠం భూములను దుర్వినియోగం చేస్తున్నారంటూ హథీరాంజీ మఠం మహంత్ అర్జున్‌దాస్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. శ్రీకాళహస్తి ఆలయ ఈవోను అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. హథీరాంజీ మఠం భూముల ఆక్రమణలపై ఇటీవల రెవెన్యూ శాఖ ఉక్కుపాదం మోపింది.

ఉప్పరపల్లిలో సుమారు 50కి పైగా అక్రమ నిర్మాణాలను జేసీబీలతో సిబ్బంది కూల్చివేశారు. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు అధికారులపై తీవ్ర ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. తిరుపతిలో హథీరాంజీ మఠానికి వందల ఎకరాల భూములున్నాయి. తక్కువ ధరలకు దొరుకుతున్నాయని కొందరు మఠం భూములను కొనుగోలు చేసేశారు. మఠం భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి.
Tirupati
Tirumala

More Telugu News