నిర్భయ దోషి పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంపై ముఖేశ్ సింగ్ రివ్యూ పిటిషన్
- నిన్న వాదనలను విని.. నేడు తీర్పును వెలువరించిన సుప్రీం
- ముఖేశ్ పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవన్న ధర్మాసనం
ఈ పిటిషన్ పై నిన్న వాదనలను విన్న ధర్మాసనం... తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు దీనిపై ధర్మాసనం తన తీర్పును వేలవరిస్తూ... ముఖేశ్ సింగ్ పిటిషన్ ను కొట్టి వేసింది. పిటిషన్ లో ముఖేశ్ కుమార్ పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రపతికి అన్ని డాక్యుమెంట్లు పంపించలేదనే ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వారి పట్ల జాలి చూపించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.