Janasena: ఎన్నికల ముందు ముద్దులు.. ఆ తర్వాత రద్దులు! : వైసీపీపై ‘జనసేన’ నేత కూశంపూడి శ్రీనివాస్ సెటైర్

  • సీఎం జగన్ పై విమర్శలు
  • ఒక వ్యవస్థలో లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి
  • అంతేతప్ప, అన్నింటినీ రద్దు చేస్తూపోతే ఎలా?
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని అధికార పార్టీ నేతలు సమర్ధిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తుండటం తెలిసిందే. తాజాగా, ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధికార ప్రతినిధి కూశంపూడి శ్రీనివాస్ వైసీపీని విమర్శిస్తూ వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.  

‘ఎన్నికల ముందు ముద్దులు, ఎన్నికల తర్వాత రద్దులు’ అంటూ ఏపీ సీఎం జగన్ పై సెటైర్లు విసిరారు. ఒక వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్లాలే తప్ప, అన్నింటినీ రద్దు చేసుకుంటూ పోతే కుదరదని, మండలిపై రద్దు తీర్మానం చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరోమాట మాట్లాడే విధానాన్ని అనుసరిస్తోందని వైసీపీపై విమర్శలు చేశారు.
Janasena
Spokes person
Pocharam Srinivas

More Telugu News