YSRCP: విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మార్చకుండా ప్రపంచంలో ఎవరూ ఆపలేరు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా  సీఎం ప్రకటించారు
  • కొన్ని రోజులు ఆలస్యమైనా అమలు మాత్రం ఖాయం  
  • విశాఖలో పర్యటించిన విజయసాయిరెడ్డి
ఎవరు అడ్డొచ్చినా మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్టణంలోని పెద్దరుషికొండ స్వర్ణభారత్ నగర్ లో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సీఎం జగన్ ప్రకటించారని, అది తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. దీనికి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తామని ధీమాగా చెప్పారు. కొన్ని రోజులు ఆలస్యం కావచ్చేమో గానీ, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను మార్చకుండా ప్రపంచంలో ఎవరూ ఆపలేరని ఘంటాపథంగా చెప్పారు.
YSRCP
Vijayasai Reddy
mp
Jagan
cm

More Telugu News