Paruchuri Gopalakrishna: ఆమని మా సినిమా ద్వారానే పరిచయమైంది: పరుచూరి గోపాలకృష్ణ
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ ఆమని గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "శివకృష్ణ నిర్మాతగా మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన 'ఆడది' సినిమా ద్వారా ఆమని పరిచయం అయింది. ఆ సినిమాలో ఆ పాత్రకి గాను ఆమెను నేనే ఎంపిక చేశాను. ఆ సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను పోషించింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు .. ఆ తరువాత ఆమె చేసిన 'జంబలకిడి పంబ' చిత్రం ఆమె కెరియర్ కి ప్లస్ అయింది. అందుకే ఈవీవీ సత్యనారాయణగారిని ఆమె ఎప్పటికీ మరిచిపోలేదు.
'ఆడది' సినిమా సమయంలోనే నేను చెప్పాను .. ఆమని పెద్ద నటి అవుతుందని. అలాగే ఆమె ఎదుగుతూ వెళ్లింది. అలాంటి ఆమని మొన్నీమధ్య ఒక సినిమాలో గ్రూపులో ఒకరిగా నిలబడి కనిపించింది. అప్పుడు మాత్రం నాకు చాలా బాధ కలిగింది. దర్శకులు మంచి పాత్రలు రాస్తే వాటికి న్యాయం చేసే సమర్థత కలిగిన తారల్లో ఆమని ఒకరు. మంచి పాత్రలను ఎంచుకుంటూ మరింత ముందుకు ఆమని వెళ్లాలని కోరుకుంటున్నట్టుగా ఆయన తన మనసులోని మాటను చెప్పారు.