లవ్ స్టోరీ రాశాను .. కొత్త హీరోను పరిచయం చేస్తాను: హీరో నాగశౌర్య
- నాగశౌర్య నుంచి 'అశ్వద్ధామ'
- యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యత
- ఈ నెల 31వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో నాగశౌర్య మాట్లాడుతూ .. "ఈ కథలో ప్రతి పాత్రకి ప్రత్యేకత .. ప్రాధాన్యత .. ప్రయోజనం ఉంటాయి. నా పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుంది. నాగశౌర్య ఎలాంటి పాత్రలైనా చేస్తాడు అనే నమ్మకం ఈ సినిమాతో ఆడియన్స్ కి కలుగుతుందని చెప్పగలను. నేను రాసిన కథ అన్ని తరగతుల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుంది. మంచి ఫీల్ తో కూడిన ఒక ప్రేమకథను కూడా రాశాను. అయితే ఈ ప్రేమకథలో నేను నటించను. ఈ కథ ద్వారా మా బ్యానర్ పైనే ఓ కొత్త హీరోను పరిచయం చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.