Roja: 'జగనన్నకు మహిళా లోకం తరుఫున కృతజ్ఞతలు' అంటూ ఇద్దరు అమ్మాయిల వీడియోను పోస్ట్ చేసిన రోజా

  • అమ్మాయిల సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు 
  • కువైట్‌లో బందీలుగా ఉన్న ఆడపడుచుల బాధలు విని ఆదుకున్నారు
  • సోషల్ మీడియాకు కూడా కృతజ్ఞతలు
అమ్మాయిల సమస్యలపై తక్షణమే స్పందిస్తూ చర్యలు తీసుకుంటూ వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కువైట్‌లో బందీలుగా ఉన్న ఆడపడుచుల బాధలు విని వెంటనే వారిని ఆదుకున్నారని రోజా తెలుపుతూ ఆ అమ్మాయిలు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వీడియోను పోస్ట్ చేశారు.

'వాట్సప్ ద్వారా తన దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పరిష్కరించి ఆడపడుచులకు అండగా నిలిచిన జగనన్నకు మహిళా లోకం తరుఫున కృతజ్ఞతలు' అని రోజా పేర్కొన్నారు. వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావడంలో ఉపయోగపడిన సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

Roja
Jagan
YSRCP

More Telugu News